NZB: ఐఎల్వో, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా వ్యవసాయ రంగంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై గురువారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పిల్లలను పనులకు పంపకుండా పాఠశాలలకు పంపాలని సూచించారు. బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం బాలకార్మిక రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు.