JBL: జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. గురువారం భూపాలపల్లి సీఐ డి. నరేశ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు సన్ గ్లాసెస్, క్యాప్‌లు పంపిణీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.