ASF: తిర్యాణి గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేకపోవడంతో పరిపాలన పనులు పెండింగ్లో పడ్డాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి రాజేశ్వరి అనారోగ్య కారణాల దృష్ట్యా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమె స్థానంలో ఇంఛార్జ్ అధికారిని నియమించడంలో ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.