KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 23 అడుగులకు చేరింది. సాగర్ నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుతం సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తున్నారు. వేసవి ఆరంభంలో జలాశయం నిండుగా ఉండడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.