IPL 2026లో ముంబై పేలవంగా ఆడుతోంది. తొలి పోరు మినహా 4 మ్యాచుల్లోనూ ఓడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తిరిగి రోహిత్‌కి అప్పగించాలని మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ సూచించాడు. 5 ట్రోఫీలు అందించిన రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం అన్యాయమని, అదే ముంబై పాలిట శాపమైందని పేర్కొన్నాడు. అటు హార్దిక్ కెప్టెన్సీపై ఫ్యాన్స్ నుంచీ విమర్శలు వస్తున్నాయి.