PDPL: గోదావరిఖనిలో ఈనెల 21న హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RSS ప్రతినిధులు ప్రశాంత్, మధుకర్ తెలిపారు. ఈ మేరకు గౌతమి నగర్ హనుమాన్ ఆలయంలో వారు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొమరవెల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ముక్కు భాస్కర్, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, తదితరులను ఎన్నుకున్నారు.