NLG: మునుగోడులోని నల్లగొండ రోడ్డు ఆటో స్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఇవాళ గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి ఆచూకీతో పాటు మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.