KMR: మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాన్సువాడకు చెందిన అయ్యల సంతోష్ నియమితులయ్యారు. మాలల చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం ఆయన్ను గుర్తించిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్ ఎస్పీ జాన్ వెస్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.