VKB: జిల్లా కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అర్హులైన నిరుపేదలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.