HYD: నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు.