KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా యాదగిరి సునీల్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సునీల్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.