నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్ ఎదుట శుక్రవారం రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని, మందుల కొరతను తీర్చాలని, ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ధర్నా చేపట్టారు. అనంతరం జీజీహెచ్లో సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు.