SRPT: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల పెంపకం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఈరోజు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. అర్హులైన ఎస్సీ యువతీ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను మున్సిపల్ లేదా మండల కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.