BHNG: కేంద్రాల్లో జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ కే.వెంకారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం)లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు.