RR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్లో మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు 3,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.