ADB: డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలన్నారు.