E.G: పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదని తూ.గో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. సీతానగరం మండలం వేదులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో 971 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచిన జి. విజయలక్ష్మిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ముగ్గళ్ల మాజీ సర్పంచ్ గెడ్డం తిమ్మరావు కూడా ఉన్నారు.