సత్యసాయి: గోరంట్లలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ, ఎస్బీఐ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలతో బొమ్మలు తయారు చేశారు. తల్లిదండ్రులతో కలిసి బొమ్మలు తయారు చేయించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని లెర్నింగ్ మెటీరియల్ను కూడా ప్రదర్శించారు.