W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో ఇవాళ ‘ఫ్రైడే -డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్ధాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.