NLR: పెంచలకోన పుణ్యక్షేత్రంలో మంత్రి ఆనం పర్యటించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రికి అధికారులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. రాబోయే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.