HNK: భీమదేవరపల్లి మండలంలో దివ్యాంగ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో ఒక నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. అత్యాచారానికి సహకరించిన మరో ముగ్గురిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ముల్కనూర్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.