JGL: జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ. 1,95,93,935 జమ చేసినట్లు పేర్కొన్నారు.