ASF: దహెగాం మండలం చిన్న ఐనం మార్కెట్ గోదాంలో ధాన్యం బస్తాలు చోరీ చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు SI విక్రమ్ మంగళవారం తెలిపారు. ఆరుగురు రైతులు గోదాంలో ధాన్యం నిల్వ చేసుకున్నారు. మండలానికి చెందిన మొర్లె కార్తీక్, గౌత్రే భీమన్న ధాన్యం చోరీ చేసినట్లు SI పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.