SKLM: పాతపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గోవిందరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖ అధికారులతో పనుల పురోగతి పై చర్చించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ, బీటీ రోడ్ల పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.