నంద్యాల జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు HPV టీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం నంద్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.