VZM: గరివిడి మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో మంగళవారం APM ధనలక్ష్మి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు గురించి అవగాహన పరుస్తూ.. రుణాలు పొందిన వారు సక్రమంగా బకాయిలు చెల్లించానని సూచించారు. గ్రామ సంఘాల పనితీరు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు.