KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి అటవీ ప్రాంతంలో పాముకాటుకు గురై ఒక కొండగొర్రె మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాముకాటుతోనే కొండగొర్రె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.