TG: చెన్నూరు కోర్టుకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హాజరయ్యారు. తమకు కేసులు కొత్త కాదని.. జైళ్లు కొత్త కాదని తెలిపారు. క్యాతన్‌పల్లి ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. చెన్నూరులో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. కాగా చెన్నూరు మున్సిపల్ ఎన్నిక సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన బాల్క సుమన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.