MDCL: ఉప్పల్ గణేష్ నగర్లో గత 5 రోజులుగా వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటి నెలకొని మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు. చోరీలు, ప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లు మరమ్మతు చేసి భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.