ASF: వేసవిలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కనీసం తాగునీరు కూడా కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని CPM జిల్లా కమిటీ సభ్యుడు ఆనంద్ కుమార్ విమర్శించారు. ఆసిఫాబాద్లో మంగళవారం మాట్లాడుతూ.. తాగునీరు లేక వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని కార్యాలయాల్లో వాటర్ కూలర్లు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.