ADB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టణంలోని 19 మందికి జైలు శిక్ష విధించినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. 13 మందికి 3 రోజులు, 6 గురికి 2 రోజులు పాటు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుందన్నారు. కుటుంబ పెద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంవల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో ఆర్థిక అసమానతలు ఏర్పడతాయని SP తెలియజేశారు.