BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నేడు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల సాక్షిగా ఈ క్రతువును పూర్తి చేశారు. భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.