KMR: ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం భగీరత్పల్లి గ్రామంలో ఆయన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.