SRCL: రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుమల స్వరూప రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్, ఇందిరానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుని రైతులు మద్దతు ధర పొందాలన్నారు.