ADB: ఆదిలాబాద్ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి నూతనంగా గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్‌ను గురువారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గత బీఆర్ఎస్ పాలనలో పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని జోగు రామన్న పేర్కొన్నారు.