హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో సినీ నటనతో పాటు లలిత కళలలో 30 రోజుల వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ కోర్సులకు దరఖాస్తులు ఈనెల 20 నుంచి మే 1 వరకు స్వీకరిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు 9346461733, 8301011865 నంబర్లను సంప్రదించాలని సూచించారు.