MNCL: చెన్నూర్ మైనారిటీ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం టైలరింగ్ శిక్షణను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ALEAP సంస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతోంది. మహిళలు నైపుణ్యాలు పెంపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.