MHBD: మహబూబాబాద్ పట్టణంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా అంజలి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతానని పేర్కొన్నారు.