KMR: కాటేపల్లి తండాకు చెందిన సీతబాయికి పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు 108ను ఆశ్రయించారు. స్పందించిన సిబ్బంది ఆమెను పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో EMT గంగారాం, పైలట్ సాయిలు సమయస్ఫూర్తితో ప్రసవం చేయగా, ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రికి తరలించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.