BDK: బీసీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ అసోసియేషన్ సభ్యులు, మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మహిళల విముక్తి కోసం జ్యోతిరావు ఫూలే జీవితాంతం ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు. విద్యనే సమానత్వానికి ఆయుధంగా భావించిన వ్యక్తి అని అన్నారు.