ASF: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చలివేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని రోగులు, వారి సహాయకుల కోసం ఈ ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేసి, వైద్య సేవలు మెరుగుపరచాలని సూపరింటెండెంట్, సిబ్బందిని ఆదేశించారు.