NZB: దర్పల్లి మండలంలోని చల్లగర్గా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఎంపీఓ రాజేష్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కేంద్రాల్లో మంచి పౌష్టిక ఆహారం అందించాలని, ప్రభుత్వం అందిస్తున్న మెనూ తప్పకుండ పాటించాలని అన్నారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.