WNP: ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా,పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో సీరియస్ నేరాలలో ‘ఆన్సైట్ FIR’ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లా పోలీసు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవను వినియోగించుకొవాలని తెలిపారు.