WGL: నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సమాన హక్కుల సాధనకు చేసిన సేవలను కొనియాడారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, పాల్గొన్నారు.