GDWL: జూరాల జలాశయంలో దూకి చాణక్య(26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్చర్లకు చెందిన ఇతడు హెటిరో ఫార్మాలో పనిచేస్తున్నట్లు ఎస్సై నందీకర్ తెలిపారు. శనివారం సాయంత్రం ప్రాజెక్టు 51వ గేటు వద్ద ద్విచక్ర వాహనం నిలిపి, నీటిలోకి దూకినట్లు గుర్తించారు. ఆదివారం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.