VKB: లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఉపాధి హామీ (NREGS) నిధులు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన CC రోడ్డు పనులను సర్పంచ్ గౌరారం హన్మయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాధా మల్లేష్, పంచాయతీ కార్యదర్శి వాసు, BRS పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.