MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఇవాళ స్థానిక ఎస్సై ఉపేందర్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిసలై, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముద్ధం వీరారెడ్డి, కడెం యాకయ్య పాల్గొన్నారు.