ASF: వాంకిడి మండలంలోని ఖమన X రోడ్డు వద్ద శనివారం రాత్రి SI మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు. తనిఖీల్లో పలువురు వాహనదారులను ఆపి శ్వాస పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.