JGL: వెల్గటూర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ ఛైర్మన్‌గా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులు, వ్యాపారులకు పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.