NZB: జిల్లాలో నిర్మిస్తున్న ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని అయోధ్య రామ మందిర శ్రీరామ విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆకాంక్షించారు. కర్ణాటకలోని మైసూర్లో ఆయన వారాహి మాత ఆలయ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తుల అంకితభావంతో మందిర నిర్మాణం జరుగుతోందన్నారు. ధర్మకర్త జ్ఞానేందర్, ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.